Operation Valentine Trailer Review: టెర్రరిస్టులు మన 40 మంది జవాన్లను..చంపిస్తే ఏం చేయలేమా?

Operation Valentine Trailer Review:  టెర్రరిస్టులు మన 40 మంది జవాన్లను..చంపిస్తే ఏం చేయలేమా?

ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakthi Prathap Sing Hada) దర్శకుడు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించింది. 

లేటెస్ట్గా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్‌, హిందీ ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌ రిలీజ్ చేశారు. '2019 ఫిబ్రవరి 14 న భారత సైన్యంపై జరిగిన ఓ దారుణ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అందులో భాగంగా జవాన్ల తో ఉన్న సీన్స్ ఎమోషన్ పెంచుతోంది. 'మనం మౌనంగా ఉన్న ప్రతిసారి..దాన్ని వాళ్ళు చేతకానీ తనంగా భావించారు. అలాంటి టెర్రరిస్టులు 100 కేజీల RDX తీసుకొస్తే..మన 40 మంది జవాన్లను చంపిస్తే మనం ఏం చేయలేమా?  అనే వరుణ్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ‘ఏం జరిగినా సరే.. చూస్కుందాం’ అంటూ దేశ గౌరవాన్ని నిలబెట్టుటకు..వరుణ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎమోషన్స్ మరియు మెయిన్ గా ఆ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

Also Read :రామ్ నందన్గా చరణ్.. ఆసక్తిరేపుతున్న గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ న్యూస్

డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ప్రతి సీన్..ఎక్కడా కూడా ఒక్క షాట్ ఇది గ్రాఫిక్స్ అన్నట్టుగా అనిపించడం లేదు. మన దేశపు ఎమోషన్ ని కూడా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ శక్తి. ఇక రుద్రా రోల్ చేసిన వరుణ్ తేజ్ తన రోల్ లో ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు.హీరోయిన్ మానుషి చిల్లర్ తెలుగు డైలాగ్స్ ని పలికిన విధానం బాగుంది. అలాగే దర్శకుడు మన దేశపు ఎమోషన్ ని కూడా బాగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది.

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్  పోరాటాలని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపించబోతున్నారు. రాడార్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా హీరోయిన్ మానుషి చిల్లర్‌‌‌‌ నటించగా, వింగ్ కమాండర్‌‌‌‌గా నవదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.