Vastu Tips: ఆఫీసులో ఈశాన్యంలో కూర్చోవచ్చా ? కొత్త ఇంట్లో బోర్ ఎక్కడ వేయాలి ?

 Vastu Tips: ఆఫీసులో ఈశాన్యంలో కూర్చోవచ్చా ?  కొత్త ఇంట్లో బోర్ ఎక్కడ వేయాలి ?

ప్రశ్న మా ఆఫీసులో ఈశాన్యం మూలకు ఏ బరువు పెట్టకుండా ఖాళీగా ఉంచాం. కానీ.. ఇప్పుడు కరేనా వల్ల ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కోసం.. సీటింగ్ పొజిషన్స్ మార్చారు. దాంతో నా సీటు ఈ శాన్యం మూలలో వేశారు. దీనివల్ల నాకేమైనా సమస్యలొస్తాయా?

జవాబు: మామూలుగా అయితే.. ఈ శాన్యంలో బరువు ఉండకూడదు. కానీ.. మనుషులు అక్కడ కూర్చుంటే. ఏ సమస్య ఉండదు. మీరు టేబుల్, చైర్ లాంటివి పెట్టాలనుకుంటే మాత్రం మూవబుల్ ఫర్నీచర్ వాడుకోండి. పనిలేనప్పుడు వాటిని పక్కకు జరిపేస్తే సరిపోతుంది. ఫిక్స్డ్ గా అక్కడే ఉంచకూడదు.

బోర్ ఎక్కడ వేయాలి?

ప్రశ్న: మేం కొత్తగా ఇల్లు కడుతున్నాం. అది తూర్పు అభిముఖంగా ఉంది. బోర్ వేద్దామని ఎక్స్పర్ట్ సలహా తీసుకున్నాం. ఆయన వాయువ్య మూలలో నీళ్లు బాగా పడతాయని చెప్పాడు. వాయువ్యంలో బోరు వేయొచ్చా?

జవాబు: వాయువ్యంలో బోరు వేయకూడదు. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో అయితే వేసుకోవచ్చు. అయితే.. మరో ఛాన్స్ లేదు. కచ్చితంగా అక్కడే వేయాలి.. అనే పరిస్థితి ఉంటే వేసుకోవచ్చు.


కాశీనాథుని శ్రీనివాస్ 
వాస్తు కన్సల్టెంట్ 
9440088799