Vastu tips: ఇంటికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటే నష్టాలొస్తాయా.. స్థలంలో ఏ దిక్కులో నిర్మించాలి..!

Vastu tips:  ఇంటికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటే నష్టాలొస్తాయా.. స్థలంలో ఏ దిక్కులో నిర్మించాలి..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో వాస్తు ప్రకారం చాలా  జాగ్రత్తలు తీసుకోవాలి..  ఇంటిని నిర్మించేటప్పుడు స్థలంలో ఎటువైపు ఎలాంటి నియమాలు  పాటించాలి.  ఇంటి ప్రధాన ద్వారాలు ఎన్ని ఉండాలి.. రెండు ఉంటే నష్టాలొస్తాయా... మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: ఇంటి ప్రధానద్వారం ఇంటికి మధ్యలోనే ఉండాలా? ఉత్తర ఈశాన్య దిక్కులో ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చా?

జవాబు:  ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు, తప్పనిసరైతే రెండు వైపులా పెట్టుకోవచ్చు. కానీ, ఒకే లైన్లో మూడు డోర్స్ ఉండకూడదు. రెండు డోర్స్ ఉంటే మాత్రం తప్పులేదు. 

ప్రశ్న:  మాకు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో స్థలం ఉంది. ఉత్తరం వైపు రోడ్డు ఉంది. అందులో సగం స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం. ఏవైపు వదిలి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది?

జవాబు: ఉత్తర-దక్షిణ దిక్కుల్లో స్థలం ఉండి, సగంలోనే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఉత్తరంవైపు స్థలం వదిలేయడం మంచిది. దక్షిణ భాగంలో ఇల్లు కట్టుకోవాలి. అది కూడా పడమరవైపు తక్కువ, తూర్పు వైపు ఎక్కువగా ఉండేలా ఇల్లు కట్టుకోవాలి. ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో ఆగ్నేయం లేదా వాయువ్యంలో బాత్రూమ్ వంటివి కట్టుకోవచ్చు.