సూర్యాపేటలో బహుజనుల బలం చూపించాలి: వట్టె జానయ్య యాదవ్ 

సూర్యాపేటలో బహుజనుల బలం చూపించాలి: వట్టె జానయ్య యాదవ్ 

సూర్యాపేట, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో బహుజనుల బలం ఏంటో చూపించాలని బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో  నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పెద్దమ్మ తల్లి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడంతో పాటు  ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సూర్యాపేట సంపదను దోచుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.

Also Read :- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు

రోడ్డు రిపేర్ల పేరుతో వ్యాపారం చేసుకునే ఆర్యవైశ్య వ్యాపారులను తీవ్ర ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పన్నులు కట్టాలని వారి ఇండ్లకు తాళాలు వేసిన సంఘటనలు ఉన్నాయని విమర్శించారు.  బహుజనులంతా ఏకమై ఏనుగు గుర్తుకు ఓటు వేసి మంత్రికి  బుద్ధి చెప్పాలని కోరారు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌‌చార్జి వట్టె రేణుక, కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, ధరావత్ నీలాభాయి లింగ నాయక్, గండూరి రాధిక రమేశ్, మాజీ ఎంపీపీ బక్యా  కాంత,  సర్పంచులు కేశబోయిన మల్లయ్య, బోడబట్ల కవిత శీను, ఎంపీటీసీలు చెరుకు ఇందిర శ్రీనివాస్, ఉప్పుల మల్లయ్య పాల్గొన్నారు.