
హైదరాబాద్, వెలుగు : ది వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (వీసీఏహెచ్) ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో వీసీఏహెచ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్ 9 వికెట్ల తేడాతో గుంటూరు వెటరన్స్ జట్టుపై గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుంటూరు 20 ఓవర్లలో 120/9 స్కోరు చేసింది. హరి (30) రాణించాడు. వీసీఏహెచ్ బౌలర్లలో గోవింద్ 4 ఓవర్లలో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వీసీఏహెచ్ 16.3 ఓవర్లలో 122/1 స్కోరు చేసి నెగ్గింది. రజనీకాంత్ (56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. చంద్రశేఖర్ (37) అండగా నిలిచాడు. మోహన్ బాబు ఒక్క వికెట్ తీశాడు. రజనీకాంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వీసీఏహెచ్ సెక్రటరీ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయవాడ వెటరన్స్ 97 రన్స్ తేడాతో నెగ్గింది. ఆర్‌ఎల్‌వీ ప్రసాద్ (108) సెంచరీతో దంచికొట్టాడు. శ్రీకాంత్ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వీసీఏహెచ్ 20 ఓవర్లలో 103/5 స్కోరు మాత్రమే చేసింది. ప్రసాద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.