నం.1 సీఎం పట్నాయక్…  5వ స్థానంలో కేసీఆర్

నం.1 సీఎం పట్నాయక్…  5వ స్థానంలో కేసీఆర్

జగన్​కు 3వ ర్యాంకు: వీడీపీ సర్వే

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రుల పనితీరు విషయంలో సీఎం కేసీఆర్​దేశంలో 5వ స్థానంలో నిలిచారు. ఒడిశా సీఎం నవీన్​పట్నాయక్​నెం 1గా నిలిచారు. రెండోస్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మూడోస్థానంలో ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డి నిలిచారు. హర్యానా సీఎం మనోహర్​లాల్​ఖట్టర్​నాలుగో ర్యాంకును పొందారు. 14 రాష్ట్రాల్లోని ప్రస్తుత ముఖ్యమంత్రుల పనితీరుపై జనం ఏమనుకుంటున్నరు? వాళ్లు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నరు? అన్నది తెలుసుకునేందుకు ‘దేశ్​కా మూడ్’ పేరుతో  వీడీపీ అసోసియేట్స్​సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. సర్వేలో మొత్తం 11,252 మంది పాల్గొన్నట్టు ఆ సంస్థ తెలిపింది. అందులో ఓటర్లు 10,098 మంది ఉన్నారు. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 14 వరకు ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 14 రాష్ట్రాల్లో సర్వే చేశారు.