
న్యూఢిల్లీ : వేదాంత లిమిటెడ్ పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ 2023–24 లో 4.7 బిలియన్ డాలర్ల (రూ.38,761 కోట్ల) ఇబిటా (ట్యాక్స్‌లు, వడ్డీలకు ముందు ప్రాఫిట్) (కన్సాలిడేటెడ్) సాధించింది. కంపెనీకి ఇది రెండో అత్యధిక ఇబిటా. 2022–23 లో 4.6 బిలియన్ డాలర్ల ఇబిటా వచ్చింది. కిందటి ఆర్థిక సంవత్సరం వేదాంతకు అత్యంత కీలకమని గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. అల్యూమినియం, జింక్, బ్రెంట్ ఆయిల్ వంటి కమోడిటీల ధరలు తగ్గడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో వేదాంత రిసోర్సెస్ రెవెన్యూ 17.1 బిలియన్ డాలర్ల (రూ.1.42 లక్షల కోట్ల) కు తగ్గింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 18.1 బిలియన్ డాలర్ల రెవెన్యూని ప్రకటించింది. కంపెనీ గ్రాస్ అప్పులు 14.3 బిలియన్ డాలర్ల (రూ.1.19 లక్షల కోట్ల) కు తగ్గాయి.