రెండేళ్లలో వేదాంత,ఇన్నోలక్స్ ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ స్క్రీన్స్​ ప్లాంట్

రెండేళ్లలో వేదాంత,ఇన్నోలక్స్ ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ స్క్రీన్స్​ ప్లాంట్

న్యూఢిల్లీ: వేదాంత, తైవాన్ కంపెనీ ఇన్నోలక్స్ జాయింట్‌‌‌‌‌‌‌‌ వెంచర్  దేశంలో ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ స్క్రీన్‌‌‌‌‌‌‌‌లు తయారు చేయడానికి రెడీగా ఉంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన 18–24 నెలల్లో  మాస్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్ చేపట్టాలని చూస్తోంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో టెక్నాలజీ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇన్నోలక్స్ పనిచేస్తుంది.  సుమారు 3–4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ల తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఈ కంపెనీ పెట్టనుందని అంచనా.

సెమీకండక్టర్స్‌‌‌‌‌‌‌‌ అండ్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే ఫాబ్‌‌‌‌‌‌‌‌ ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌  కింద ఈ జాయింట్ వెంచర్ కంపెనీ  ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ను సబ్మిట్ చేసింది. ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ డిస్‌‌‌‌‌‌‌‌ప్లేల మాస్ ప్రొడక్షన్ ఇంకో   రెండేళ్లలో మొదలవుతుందని ఇన్నోలక్స్ సీఓఓ జేమ్స్‌‌‌‌‌‌‌‌ యాంగ్ పేర్కొన్నారు. ఫేజ్‌‌‌‌‌‌‌‌ 2 కు మరో 6 నుంచి 9 నెలల టైమ్‌‌‌‌‌‌‌‌ పట్టొచ్చని చెప్పారు. కాగా, డిస్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేరుకోవడానికి పూర్తిగా దిగుమతులపై ఇండియా ఆధారపడుతోంది.