
హ్యాండ్ బ్యాగ్, పర్స్.. చివరకు లంచ్ బాక్స్ అయినా సరే.. ఫ్యాషనబుల్‌గా ఉండాలి. వాటి వల్ల పర్యావరణం కలుషితం కావొద్దు అనుకుంటారు కొందరు. అందుకని ప్లాస్టిక్ బదులు మట్టిలో తొందరగా కలిసిపోయే వీగన్ బ్యాగ్స్ తయారుచేస్తున్నారు డిజైనర్లు. వీగన్ బ్యాగ్స్ తయారీలో పండ్ల తొక్కలు, చెట్ల ఆకులు, బెరడుతో పాటు ఇతర పండ్ల వేస్ట్, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ కలిపి వీటిని తయారుచేస్తారు. తయారీకి ఉపయోగించిన మెటీరియల్‌ని బట్టి రకరకాల రంగుల్లో దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్‌తో పాటు యాక్సెసరీస్, బట్టలు కూడా తెస్తున్నారు ఇంగ్లాండ్‌కి చెందిన స్టెల్లా మెక్కార్టెనీ, ఎంజెలా అండ్ రాయ్ వంటి పాపులర్ డిజైనర్స్. ఇవి ఆన్లైన్లో 2,000 రూపాయల నుంచి ఉన్నాయి. 2025 కల్లా వీగన్ లెదర్ మార్కెట్ 85 బిలియన్ డాలర్లు ఉంటుందనేది ఎక్స్పర్ట్స్ అంచనా.