సోమాజీగూడలోని సైనిక్ ఆరామ్ ఘర్లో వీర్ నారి ప్రోగ్రాం

సోమాజీగూడలోని సైనిక్ ఆరామ్ ఘర్లో వీర్ నారి ప్రోగ్రాం

పంజాగుట్ట, వెలుగు: సోమాజీగూడలోని సైనిక్​ఆరామ్​ఘర్​లో బుధవారం వీర్​నారి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సైనికాధికారి శ్రీనీష్​కుమార్ ​ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ యుద్ధాలు, విపత్తుల సమయంలో వీర మరణం పొందిన సైనికుల వారసులకు సముచిత గౌరవం ఇస్తామని పేర్కొన్నారు.

ఈ ప్రోగ్రాంకు రాష్ట్రం నుంచి వీరమరణం పొందిన సైనికుల కుటుంబసభ్యులు హాజరవుతారన్నారు. వారికి ప్రభుత్వం తరఫున వివిధ సంక్షేమ పథకాలను అందజేయనున్నట్లు తెలిపారు.