సిద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 334 ఎకరాల ప్రభుత్వ భూమి సంగతి తేల్చాలి : వీర్లపల్లి శంకర్

సిద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 334 ఎకరాల ప్రభుత్వ భూమి సంగతి తేల్చాలి : వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం సిద్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను పేదల నుంచి వ్యవహారంపై విచారణ జరిపించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని  సిద్దాపూర్ అసైన్డ్ భూముల గురించి చర్చించారు. 

 గ్రామంలోని 334  ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.  అంతకుముందు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం నిరుపేదల అసైన్డ్ భూములు సేకరించారు.  ఆ తర్వాత ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ మాట మార్చారని అసలు పేదల భూములను ఎందుకు లాక్కోవాల్సి వచ్చింది.. ఎందుకు సేకరించాల్సి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  ఈ వ్యవహారంలో విచారణ జరిపితే కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ తో ఎమ్మెల్యే శంకర్ సమావేశం అయ్యారు.