నోటీసులివ్వకుండా దుకాణాలకు తాళాలు వేశారు

V6 Velugu Posted on Jun 01, 2021

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత కూరగాయల మార్కెట్లో వ్యాపారులు, మున్సిపల్ కమిషనర్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. భౌతిక దూరం పాటించడం లేదని, కొనుగోలుదారుల వాహనాలతో ట్రాఫిక్ జాం అవుతోందని మార్కెట్‌ను కొత్తగా నిర్మించిన రైతు బజార్‌కు తరలించాలని కమిషనర్ వ్యాపారులకు కోరారు. అయితే ఎటువంటి నోటీసు లేకుండా తమ దుకాణాలకు తాళాలు వేశారంటూ వ్యాపారులు నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేది లేదన్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ, పాత మార్కెట్‌లోనే వ్యాపారం చేసుకుంటామని తెలిపారు.

Tagged Telangana, Karimnagar, Municipal Commissioner, jammikunta, , vegetable merchants, jammikunta rythu bazar

Latest Videos

Subscribe Now

More News