గత నెల 5% పెరిగిన వెహికల్​ సేల్స్​

గత నెల 5% పెరిగిన వెహికల్​ సేల్స్​

పీవీల అమ్మకాల్లో 11 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: కరోనా వల్ల ఎంతో నష్టపోయిన ఆటో కంపెనీలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అన్ని కేటగిరీల్లో గత నెల 17.32 లక్షల వెహికల్​ యూనిట్లు  అమ్ముడయ్యాయి. 2020 జనవరి అమ్మకాలతో (16.50 లక్షల యూనిట్లు) పోలిస్తే అమ్మకాలు ఐదు శాతం పెరిగాయి. హోల్​సేల్​ విధానంలో గత నెల 2.76 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2020 జనవరి అమ్మకాలు 2.48 లక్షల యూనిట్స్​తో పోలిస్తే  ఇవి 11.14 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్​ఇండియన్ ఆటోమొబైల్​ మానుఫ్యాక్చరర్స్​(సియామ్) ప్రకటించింది. డీలర్లకు టూవీలర్​ డిస్పాచ్​లు 6.63 శాతం పెరిగి 14.29 లక్షలకు చేరుకున్నాయి.

బైకుల సేల్స్​ 5.1 శాతం పెరిగి 4.54 లక్షల యూనిట్లుగా, స్కూటర్​సేల్స్​9.06 శాతం పెరిగి 4.54 లక్షల యూనిట్లుగా రికార్డయ్యాయి. త్రీవీలర్స్​సేల్స్​ మాత్రం ఏకంగా 56.76 శాతం పడి 26,335 యూనిట్లకు తగ్గాయి. గత జనవరిలో 4.16 లక్షల యూనిట్ల త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుండై, కియా మోటార్స్​, టాటా కంపెనీల హోల్​సేల్స్​ను పెంచుకున్నాయి. సాధారణ కార్ల కంటే స్పోర్ట్స్​ యుటిలిటీ వెహికల్స్​ ఎక్కువ అమ్ముడయ్యాయి.  ‘‘ఇప్పటికీ సప్లై చెయిన్​ సమస్యలు ఉండటం, ఉక్కు రేట్లు పెరగడం, సెమీకండక్టర్ల అవైలబిలిటీ తక్కువగా ఉండం వల్ల   ఇబ్బందులు ఎదురవుతున్నాయి”అని సియామ్​ డైరెక్టర్​ జనరల్​ రాజేశ్​ మీనన్​ వివరించారు.