నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ పట్టణంలో 30 కిలోల గంజాయి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు శనివారం సాయంత్రం నారాయణఖేడ్ నుంచి వాసర్ వెళ్లే రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా షేరీ తండాకు చెందిన చవాన్ ప్రభు, మున్యా నాయక్ తండాకు చెందిన రాథోడ్ పర్లాల్ గంజాయితో పట్టుబడ్డారు.
బీదర్ నుంచి నారాయణఖేడ్ వైపు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.15 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐ శంకర్, ఎస్సైలు అనుదీప్, హన్మంతు పాల్గొన్నారు.
