బార్డర్‌లో వాహనాల నిలిపివేత.. అంబులెన్స్‌లోనే ఇద్దరు పేషంట్లు మృతి

బార్డర్‌లో వాహనాల నిలిపివేత.. అంబులెన్స్‌లోనే ఇద్దరు పేషంట్లు మృతి

ఈ పాస్ మరియు పేషంట్‌కు హాస్పిటళ్లో బెడ్ కన్ఫర్మ్ అయితేనే ఎంట్రీ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో బార్డర్ల వద్ద అంబులెన్స్‌లను పోలీసులు ఆపుతున్నారు. పోలీసుల తీరుతో కర్నూల్ జిల్లా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్‌లు భారీగా నిలిచిపోయాయి. సుమారు ఇప్పటికే 30కి పైగా బెడ్ బెర్త్ ఖరారు కానీ అంబులెన్స్‌లను  తెలంగాణ పోలీసులు వెనక్కి పంపారు. తెలంగాణ ప్రభుత్వ పాసులున్న అంబులెన్స్‌లను కూడా పోలీసులు, హెల్త్ అధికారులు అనుమతించడంలేదు. 

ఉదయం 5 గంటల నుంచి బార్డర్‌లో అంబులెన్స్‌లను పోలీసులు ఆపుతున్నారు. దాంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్‌లో అంబులెన్స్‌లను పోలీసులు అనుమతించకపోవడంతో.. నంద్యాల, కడప జిల్లాలకు చెందిన ఇద్దరు కరోనా పేషంట్లు అంబులెన్స్‌లలోనే మృతిచెందారు. దాంతో పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పేషంట్ల బంధువులు పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు.

విషయం తెలసిన కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ హుటాహుటిన పుల్లూర్ టోల్ ప్లాజాకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యం విషమించిన పేషంట్లు వెంటనే హైదరాబాద్ వెళ్లడానికి అనుమతించాలని పోలీసులకు సూచించారు.