ఫుడ్ కోర్టులో ఇన్వెస్ట్ పేరిట ఫ్రాడ్

ఫుడ్ కోర్టులో ఇన్వెస్ట్ పేరిట ఫ్రాడ్
  • ఇద్దరి నుంచి  రూ.75 లక్షలు తీసుకున్న డ్రగ్స్ కేసు నిందితుడు రఘు తేజ  

గచ్చిబౌలి, వెలుగు : ఫుడ్​కోర్టులో ఇన్వెస్ట్​ చేస్తే ప్రాఫిట్​ఇస్తానని చెప్పి డ్రగ్స్​ కేసు నిందితుడు వెలగపూడి రఘుతేజ.. ఇద్దరి నుంచి   భారీగా డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలికి చెందిన ఠాగూర్ ప్రసాద్​ మోటూరికి 2021లో ఓ కామన్​ ఫ్రెండ్​ద్వారా వెలగపూడి శ్రీనివాస్, అతని కొడుకు రఘుతేజ పరిచయం అయ్యారు. వీరిద్దరూ ప్రసాద్​కు ఇన్ఫినిటీ డ్రైవ్​ఇన్​ఫుడ్​కోర్టును పెడుతున్నామని, ఇందులో ఇన్వెస్ట్ చేయాలని, 5 శాతం ప్రాఫిట్​ఇస్తామని కోరారు. దీంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.

ఆ తర్వాత ప్రసాద్​రూ.75 లక్షలు శ్రీనివాస్​కు ట్రాన్స్​ఫర్​చేశాడు. అనంతరం తండ్రీకొడుకులు ఎలాంటి ప్రాఫిట్​ను ప్రసాద్​కు ఇవ్వడం లేదు. తనకు రెవెన్యూ డాక్యుమెంట్లు, ప్రాఫిట్​ఇవ్వాలని ప్రసాద్​అడగ్గా 2022 డిసెంబర్​లో రూ. 10 లక్షలు ట్రాన్స్​ఫర్​ చేశారు. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని అడగ్గా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రసాద్ తనను చీటింగ్​చేసిన తండ్రీకొడుకులపై బుధవారం గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేయగా  శ్రీనివాస్, రఘుతేజపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అదేవిధంగా ఫుడ్​కోర్టు పేరుతో రఘుతేజ, శ్రీనివాస్​పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని చీటింగ్​చేసినట్లు బాధితుడు కళ్యాణ్​చక్రవర్తి ఈనెల 14న గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్​ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే  రఘుతేజపై రాయదుర్గం పీఎస్​లో డ్రగ్స్​కేసు నమోదైంది. అయితే, డ్రైవ్​ఇన్​లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన తండ్రీ కొడుకులను అరెస్ట్​ చేయాలని బాధితులు డిమాండ్​ చేస్తున్నారు.