40 బహుమతుల్లో 10 వెలుగుకే 

40 బహుమతుల్లో 10 వెలుగుకే 
  • బెస్ట్ న్యూస్ పిక్చర్‌‌‌‌లో వరికిల్ల నరేశ్‌‌కు ​ఫస్ట్ ప్రైజ్ 
  • ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా  ఐఅండ్‌‌పీఆర్ అవార్డుల ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇన్ఫర్మేషన్‌‌ అండ్‌‌ పబ్లిక్‌‌ రిలేషన్‌‌ (ఐఅండ్‌‌పీఆర్) డిపార్ట్‌‌మెంట్‌‌ నిర్వహించిన ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌‌లో ‘వెలుగు’ఫొటో జర్నలిస్టులకు 10 అవార్డులు వచ్చాయి. బంగారు తెలంగాణ, పల్లె, పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తా చిత్రం, అర్బన్ అండ్ రూరల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్, స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్ విభాగాల్లో ఫొటో కాంపిటీషన్లకు ఎంట్రీలను ఐఅండ్‌‌పీఆర్ ఆహ్వానించింది. ఇందులో బెస్ట్ న్యూస్ పిక్చర్‌‌‌‌కు గాను ‘వెలుగు’ఫొటోగ్రాఫర్ నరేశ్‌‌ వరికిల్లకు ఫస్ట్ ఫ్రైజ్‌‌ వచ్చింది. స్కై లైన్ కేటగిరీలో థర్డ్, కన్సోలేషన్ ప్రైజ్, బంగారు తెలంగాణ కేటగిరీలో కన్సోలేషన్‌‌తో కలిపి 5 అవార్డులు వచ్చాయి.

వెలుగు సిద్దిపేట ఫొటోగ్రాఫర్ మహిమల భాస్కర్‌‌‌‌ను అర్బన్ అండ్ రూరల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌లో సెకండ్ ప్రైజ్‌‌ వరించింది. కన్సోలేషన్ కింద మరో రెండు కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. బంగారు తెలంగాణ కేటగిరీలో శివకుమార్‌‌‌‌కు థర్డ్ ప్రైజ్, బెస్ట్ న్యూస్ పిక్చర్‌‌‌‌లో సురేశ్‌‌గౌడ్ కన్సో లేషన్ ప్రైజ్‌‌లు గెలుచుకున్నారు. ఐఅండ్‌‌పీఆర్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌‌కు మొత్తం 96 మంది 1,200 ఫొటోలను పంపగా, 40 అవార్డులు ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్‌‌కు రూ.20,000, సెకండ్ ప్రైజ్‌‌కు రూ.15,000, మూడో ప్రైజ్‌‌ కింద రూ.10 వేలు, కన్సోలేషన్ ప్రైజ్‌‌ కింద రూ.5,000 చొప్పున నగదుతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం 25న ఉంటుందని ఐఅండ్‌‌పీఆర్ తెలిపింది.