
ముషీరాబాద్,వెలుగు : సిటీలో స్టూడెంట్స్ కు స్పెషల్ బస్సులు నడపాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మహాలక్ష్మి స్కీమ్ కారణంగా అరకొర బస్సులతో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు.
గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయాణంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో చదువుపై పడే ప్రమాదం ఉందని, ప్రభుత్వం స్పందించి వారికి ప్రత్యేక బస్సులు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.