రాజన్న ఆలయ విస్తరణ పనులను స్పీడప్ చేయాలి : విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాజన్న ఆలయ విస్తరణ పనులను స్పీడప్ చేయాలి : విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • పనులను పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వేములవాడ/రాజన్న సిరిసిల్ల, వెలుగు: ---వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఆలయ దక్షిణం వైపు భారీ యంత్రాలతో చేస్తున్న పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

  అంతకుముందు వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలోని నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను, మూలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను, ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు, డ్రైనేజ్ పనుల్లో స్పీడ్​ పెంచాలని అదేశించారు. 

భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లతో పాటు, షవర్లు, కల్యాణకట్ట, క్యూలైన్లు పరిశీలించారు. అనంతరం  భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాధాబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈవో రమాదేవి, మున్సిపల్​ కమిషనర్​అన్వేష్​, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, తదితరులు పాల్గొన్నారు.


రూ. 8.12 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని విప్ ఆది శ్రీనివాస్ పిలుపుఇచ్చారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి కింద 8,871 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీలకు రూ.8.12 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని వివరించారు. కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ జిల్లా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యనారాయణ గౌడ్, సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.