వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు

వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయం హుండీలను ఇవాళ లెక్కించారు. మహాశిరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు భక్తులు హుండీకి సమర్పించిన నగదు, కానుకల లెక్కింపును చేపట్టారు. నగదును, ఇతర కానుకలను వేరు చేసిన తర్వాత ముందుగా నగదును లెక్కించారు. సీసీ కెమెరా నిఘా నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో హుండీల లెక్కింపు జరిగింది. రికార్డు స్థాయిలో  హుండీ ఆదాయం 1కోటి 96 లక్షల 9 వేల  22 రూపాయిలు వచ్చింది. అలాగే నగదుతోపాటు 234 గ్రాముల బంగారం, 17 కిలోల 850 గ్రాములు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. 
 

ఇవి కూడా చదవండి

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

ఉక్రెయిన్ నుంచి వచ్చిన కొడుకుని హత్తుకుని ఏడ్చేసిన తల్లి

మంత్రి జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్