రాజన్నకు రూ. 94 లక్షల ఆదాయం

రాజన్నకు రూ. 94 లక్షల ఆదాయం

వేములవాడ, వెలుగు :  వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ. 94 లక్షల ఆదాయం సమకూరింది. హుండీల ద్వారా వచ్చిన కానుకలను బుధవారం భీమేశ్వర సదన్‌‌‌‌‌‌‌‌లో లెక్కించారు. మొత్తం రూ. 94 ,29,209లతో పాటు 67 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో ఈఓ రమాదేవి, ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.