వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు: దక్షిణకాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించారు. సోమవారం స్వామిని దర్శించుకోవడానికి వీలుగా ఆదివారం సాయంత్రం వరకు భక్తులు భారీగా చేరుకున్నారు.