ఎములాడ రాజన్నకు రూ.2.19 కోట్ల ఇన్‌‌‌‌కం

ఎములాడ రాజన్నకు రూ.2.19 కోట్ల ఇన్‌‌‌‌కం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. మొత్తం 36 రోజులకు సంబంధించి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం ఆలయ ఓపెన్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లో లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 2,19,35,165లతో పాటు 124.500 గ్రాముల బంగారం, 10.500 కిలోల వెండి సమకూరినట్లు ఈవో రమాదేవి తెలిపారు. లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు ఎం.రాజమౌళి, ఏఈఓ లు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.