ఎములాడని యాదగిరిగుట్టలా అభివృద్ధి చేస్తాం:KTR

ఎములాడని యాదగిరిగుట్టలా అభివృద్ధి చేస్తాం:KTR

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. వేములవాడలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలపై స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్ట తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

వేములవాడ గుడి చెరువును వరంగల్ బండ్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిలవనున్నాయని చెప్పారు. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్, వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.