ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పండగ చిత్రాల సందడి కొనసాగుతుండగా, సినీ ప్రేక్షకులకు మరో క్రేజీ అప్‌డేట్ అందిస్తూ "మిరాకిల్" (Miracle) చిత్ర బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ ను సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 16న) విడుదల చేశారు.
మాస్ డైరెక్టర్ మార్క్ యాక్షన్
'సత్యా గ్యాంగ్', 'ఫైటర్ శివ' వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు స్వయంగా సంగీతాన్ని కూడా సమకూరుస్తుండటం విశేషం. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
క్రేజీ తారాగణం.. అద్భుతమైన లైనప్
స్టార్ కాస్ట్: 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. హీరోగా రణధీర్ భీసు నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా అక్షర నున్న సుజన అలరించనుంది. ఒకప్పటి లవర్ బాయ్ శ్రీరామ్ , సీనియర్ నటుడు సురేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు సినిమా గమనాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయట. ఈ చిత్రం ద్వారా నాయుడు పెండ్ర ప్రతి నాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
రెండో షెడ్యూల్‌కు సిద్ధం
ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. చిత్ర నిర్మాతలు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 22 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. యాక్షన్ బ్లాక్స్, హెబ్బా పటేల్ గ్లామర్, ప్రభాస్ నిమ్మల టేకింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయి అని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీమతి జ్యోత్స్న సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాంబాబు గోసాల సాహిత్యం అందిస్తుండగా, శ్రీను ఫైట్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. సీనియర్ నటి ఆమని, ఝాన్సీ వంటి దిగ్గజ నటులు కూడా ఇందులో భాగం కావడంతో "మిరాకిల్" పై అంచనాలు పెరిగాయి..
