
రూపాయికే అంత్యక్రియల పథకం ప్రవేశ పెట్టిన కరీంనగర్ మేయర్ ను ప్రశంసించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘కులమతాలు, పేద, ధనిక అనే భేదాలు లేకుండా అంతిమ యాత్ర పథకం ఏర్పాటు చేసి రూ.1.50 కోట్లు కేటాయించిన కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కు, మేయర్ ఎస్. రవీందర్ సింగ్ కు అభినందనలు, సంప్రదాయాలకు అనుగుణంగా గత ఆచారాలకు గౌరవమివ్వడం చాలా ముఖ్యం‘ అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
పేద వారి అంత్యక్రియల కోసం కరీంగనర్ నగర పాలక సంస్థ ‘అంతిమ యాత్ర‘ పథకం జూన్ 15 నుంచి అందుబాటులోకి తెస్తుందని సోమవారం మేయర్ రవీందర్ ప్రకటించాడు. అంత్య క్రియలకు కావాల్సిన అన్ని వసతులు నగర పాలక సంస్థ చూసుకుంటుందని చెప్పాడు. ఇందు కోసం రూపాయి పే చేసి టోకెన్ తీసుకుని అంత్యక్రియలు చేసుకోవచ్చని.. చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుందని చెప్పాడు.