2047కల్లా సరికొత్త భారత్ ను నిర్మిద్దాం

V6 Velugu Posted on Apr 06, 2021

దండి: దేశంలో మరిన్నిమార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2047కల్లా కొత్త భారతాన్ని నిర్మిస్తామనే నమ్మకం ఉందన్నారు. అందుకోసం ఇప్పటినుంచే అందరమూ కష్టపడాలని చెప్పారు. 2047కు దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని.. అప్పటికీ నూతన ఇండియాను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ స్వాతంత్ర్య సమర యోధులు చూపిన బాటలో నడిచి అనేక ఘనతలు సాధించామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే 25 ఏళ్లలో మరింతగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

Tagged Mahatma Gandhi, sardar vallabhbhai patel, vice president venkaiah naidu, New India

Latest Videos

Subscribe Now

More News