రీసెంట్‌గా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చిన వెంకటేష్.. ఏమాత్రం విరామం తీసుకోకుండా తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. నందమూరి కల్యాణ్ రామ్‌తో కలిసి ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం కజకిస్థాన్‌లో జరుగుతోంది. ఇప్పటికే మూవీ టీమ్ అంతా కజకిస్థాన్‌కు చేరుకోగా.. తాజాగా వెంకటేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్న కీర్తి సురేష్, కృతి శెట్టితోపాటు కీలక పాత్రలు పోషిస్తున్న అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ క్లైమాక్స్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఇద్దరు హీరోలు కలిసి నటిస్తుండటం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు, సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌పైనా టీమ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలో ఓ పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
