
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు స్పందిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని స్పందిస్తున్నారు. కానీ ఇటీవలే సుప్రీం కోర్టు మాత్రం తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఆనవాలు కనిపించలేదని దాంతో నిజానిజాలు తెలుసుకోక ముందే అసత్య ప్రచారాలు చెయ్యవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సీరియస్ అయ్యింది.
ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం ప్రశ్నల వెల్లువ.. భక్తుల మనోభావాలతో ఆటలొద్దంటూ సీరియస్..
దీంతో ఈ విషయంపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ వీడియో ని షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో వీణ మాట్లాడుతూ పరమపవిత్రమైన తిరుమల లడ్డు కోసం ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు సోషల్ మీడియాలో ఓవరాక్టింగ్ చేసారని అన్నారు. అలాగే భక్తుల మనోభావాల్ని హింసించారని ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో లేని ప్రాయశ్చిత్త శ్లోకాలు కనిపెట్టి భక్తులతో చెప్పించి నానా హంగామా చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తిరుమల లడ్డు విషయంలో సుప్రీం కోర్టు స్పందించిన తీరుని గుర్తు చేస్తూ మీరు నిజమైన హిందువులు, వెంకటేశ్వరస్వామి భక్తులైతే క్షమించమని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? అని ప్రశ్నించింది.