విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదగాలి : వేణుగోపాల్‌‌

విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదగాలి : వేణుగోపాల్‌‌

ములుగు, వెలుగు : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ములుగు అడిషనల్‌‌ కలెక్టర్‌‌ వేణుగోపాల్‌‌ సూచించారు. ములుగులోని కలెక్టరేట్‌‌లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చేతి వృత్తుల కళాకారులు నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ స్కీమ్‌‌ కింద ట్రైనింగ్‌‌ ఇవ్వనున్నట్లు చెప్పారు.

టూల్‌‌కిట్లు, పరికరాలు పంపిణీ చేయడం, ఈజీ మార్కెటింగ్‌‌ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. హస్తకళాకారుల ఉత్పత్తులకు బ్రాండింగ్‌‌ అవకాశాలు కలిగించడం, ఆధునిక యంత్రాలు సమకూర్చడం, నైపుణ్యాలను పెంచుకునేలా ట్రైనింగ్‌‌ ఇవ్వడంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీస్‌‌ జీఎం సురేశ్‌‌, ఎంఎస్‌‌ఎంఈ అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ శివ రామప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్‌‌ ఈడీ తుల రవి, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్ పాల్గొన్నారు.