జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శుక్రడు.. ఐశ్వర్యానికి సంపదకు కారకుడు. అన్ని గ్రహాలకు చాలా ప్రత్యేకత ఉన్నా.. ఈ గ్రహం ఆదాయం.. ఖర్చులపై ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉంటే నవంబర్ 30 న ఉదయం 9.27 గంటలకు శుక్రుడు.. వరుణుడి( నెప్ట్యూన్) తో కలవడంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చేసినపుడు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సార్లు గ్రహాల కారణంగా ఏర్పడిన శుభ యోగాలు అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి. దాంతో జీవితమే మారిపోతుంది.శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలకు కారకుడు. శుక్రుడు త్వరలో నవ పంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు.ఈ యోగం కొన్ని రాశుల ( వృషభ,మీన, తులా) వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది.
వృషభ రాశి : శుక్రుడు నవపవంచమమోగం వలన జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశివారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీరు ఆచరించాల్సిన పనులను ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి మంచి సమయమని చెప్పవచ్చు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెళ్లి కోసం ఎదురుచూసే వారు గుడ్ న్యూస్ వింటారు.ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు.
మీన రాశి : ఈ రాశి వారికి అవకాశాలు బాగా కలసి వస్తాయి. శుక్రుడు నవపంచమయోగం ఏర్పరచడంతో ఈ రాశి వారి జీవితంలో ఆనందం పెరుగుతుంది. కొత్త ఆదాయమార్గాలు ఏర్పడుతాయి. కుటుంబసభ్యుల మద్దతు పుష్కలంగా ఉండటంతో కెరీర్ లో అనుకోని మంచి మార్పులు కలుగుతాయి. సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి. బంధువుల వర్గంలోని వారితో పెళ్లి ముచ్చట్లు జరుగుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులకు పరిష్కారం లభిస్తుంది.
తులా రాశి : ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కార్యాలయంలో చక్కటి అనుభూతిని పొందుతారు. ప్రమోషన్ వచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ప్రతిఫలం పొందుతారు ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
నవ పంచమయోగం అంటే ఏమిటి..
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం. ఒక గ్రహం మరొకదానితో కలసినప్పుడు.. ఆగ్రహాల ప్రభావంవలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి. శుక్రుడు .. వరుణుడితో కలసినప్పుడు శక్తివంతమైన నవపంచమ యోగాన్ని ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల జీవితాల్లో డబ్బు, ఆనందం వంటి అంశాలు మెరుగుపడతాయి. జ్యోతిషశాస్త్రంలో, రెండు గ్రహాలు ఒకే రాశిలో లేదా దగ్గరగా ఉన్నప్పుడు ఈ 'సంయోగం' ఏర్పడుతుంది. దీనినే నవపంచమయోగం అంటారని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
