జ్యోతిష్యం:  గురుడు.. శుక్రుడు.. బుధుడు  కలయిక.. సరస్వతి యోగంతో ఆరు రాశుల వారికి లక్కే లక్కు 

జ్యోతిష్యం:  గురుడు.. శుక్రుడు.. బుధుడు  కలయిక.. సరస్వతి యోగంతో ఆరు రాశుల వారికి లక్కే లక్కు 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు ఎప్పటి కప్పడు వాటి స్థానాలను మారుతుంటాయి.  ఒకే రాశిలో రెండు .. మూడు గ్రహాలు కలిసి సంచరించే టప్పుడు కొన్ని ప్రత్యేక మైన యోగాలు ఏర్పడుతాయి.  ఇలా జరగడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.  ప్రస్తుతం.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  మే 21 వ తేదీన శుక్రుడు... బుధుడు.. గురుడు కలిసి సరస్వతి యోగాన్ని ఏర్పరచునున్నారు.  ఈ యోగం వలన ఆరు రాశుల (వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ )వారికి అదృష్టం యోగం పడుతుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!

 వృషభరాశి: ఈ రాశి వారికి ఇంటి బయటా ప్రాధాన్యత పెరుగుతుంది.  సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది.  కుటుంబంలో శుభపరిణాలు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు.  చేతి వృత్తుల వారికి.. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.  కొత్తగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయి.  ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  కొత్త ప్రాజెక్ట్ లకు ఒప్పందం చేసుకుంటారు.  జాబ్​ మారాలనుకునే వారికి చాలా శుభసమయమని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మిథునరాశి: ఈ రాశి వారికి సరస్వతి యోగం ( గురుడు, బుధుడు,శుక్రుడు కలయిక) వలన మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది,  కొత్తగా ఇంటి నిర్మాణానికి ప్లాన్​ వేస్తారు. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు.  ఇక ఆర్థిక విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి.  పూర్వీకుల ఆస్థి కలసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్నీ విధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు.  అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సింహరాశి: ఈ రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది.  వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. భార్య తరపు ఆస్తి కలసి వస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగాఉంటుంది.  గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.  వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి.  ఉద్యోగస్తులు ఆఫీసు నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

కన్యారాశి: ఈ రాశి వారికి అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. సరస్వతి యోగం వలన వీరి జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.

తులారాశి :  ఈ రాశి వారికి సరస్వతి యోగం వలన  జీవితాల్లో సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సామాజిక హోదా పెరగడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టం తోడవడంతో పనులన్నీ సజావుగా సాగుతాయి.  ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే మూదు పువ్వులు ఆరుకాయలుగా వీరి జీవితం కొనసాగుతుంది.

కుంభ రాశి:  ఈ రాశి వారికి  ఎటువంటి సమస్యలున్నా, విభేదాలున్నా తొలగిపోతాయి. అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల్లోనే కాక, అధికారుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. మంచి పరి చయాలు ఏర్పడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.గతంలో నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. చాలా కాలంగా మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం ఆసన్నమైందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.