
పర్వతగిరి/ కాజీపేట/ జనగామ అర్బన్/ తొర్రూరు, హనుమకొండ సిటీ, వెలుగు: పల్లెలు, పట్టణాలు పూల వనాలయ్యాయి. మంగళవారం ఏడో రోజు వేపకాయల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వరంగల్జిల్లా పర్వతగిరి ఎంపీడీవో ఆఫీస్‌లో ఎంపీడీవో శంకర్నాయక్ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాజీపేటలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో డివిజనల్మేనేజర్ప్రఖార్వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు.
జనగామ పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంటలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం పద్మ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మహిళా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర కృష్ణస్వామి, జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్య శ్రీరెడ్డి తదితరులు బతుకమ్మ ఆడిపాడారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వాస్పత్రిలో డీఎంహెచ్‌వో మురళీధర్, సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజుఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.
వరంగల్కలెక్టరేట్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్, సత్యశారదాదేవి, మేయర్సుధారాణి, కమిషనర్అశ్వినీ తానాజీ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, నాగరాజు పాల్గొనగా, వరంగల్సీపీ కార్యాలయం వద్ద సీపీ అంబర్‌కిషోర్‌ఝా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన మహిళా ఆఫీసర్లు, ఉద్యోగులు సందడి చేశారు.
హనుమకొండ జిల్లాకలెక్టర్ ప్రావీణ్య , వరంగల్ ఎంపి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిసతీమణి నాయిని నీలిమా బతుకమ్మలను పట్టుకుని ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఆకుల రాజేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.