
నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘కస్టడీ’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మే 12న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘వెంకట్ ప్రభు కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. షూటింగ్ పూర్తై, ఎడిటింగ్‌లో చూసినప్పుడు కూడా అదే ఎక్సయిట్‌మెంట్ ఉంది. నా కెరీర్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీ ఇది. అరవింద్ స్వామి ఈ ప్రాజెక్టులోకి రావడంతో మా అందరికీ కాన్ఫిడెన్స్ పెరిగింది.
ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. శరత్ కుమార్ గారికి, నాకు చాలా యూనిక్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. మొదటి ఇరవై నిమిషాలు కూల్‌గా వెళుతుంది. ఇంటర్వెల్‌కి ముందు నుంచి థియేటర్‌లో బ్లాస్ట్ అవుతుంది. అందరూ కొత్త చైతూని చూడబోతున్నారు’ అని చెప్పాడు. ‘రేవతి పాత్రలో కనిపిస్తాను. శివ (నాగ చైతన్య) తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తాడు. రేవతి తన ప్రేమ కోసం ఫైట్ చేస్తుంది . మే 12న మీ అందరినీ కస్టడీలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం’ అంది కృతిశెట్టి. ‘ ఇందులో స్టైల్,యాక్షన్, పెర్ఫార్మెన్స్, సెంటిమెంట్, మాస్ సహా అన్నీ ఉన్నాయి. తప్పకుండా థియేటర్స్‌లో సర్‌ప్రైజ్ అవుతారు’ అన్నాడు వెంకట్ ప్రభు. ప్రియమణి, అబ్బూరి రవి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి పాల్గొన్నారు.