వరుణుడు కుమ్మేశాడు..గంటలో ఇంత వర్షమా

వరుణుడు కుమ్మేశాడు..గంటలో ఇంత వర్షమా

హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో కుంభ వృష్టి వర్షం పడుతోంది. అతి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లుపై వర్షపు నీరు నదులను తలపిస్తున్నాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  భారీ వర్షం కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  ఖైరతాబాద్ జంక్షన్లో  నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నీటిని తోడేస్తున్నారు. 

Also Read :- హైదరాబాద్ సిటీలోభారీ వర్షం.. ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రావొద్దు

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రికార్డు వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే  జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీ హిల్స్ లో 3.8 సెంటీమీటర్లు..
ఖైరతాబాద్ లో 3.5 సెంటీమీటర్లు..మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వాన కురిసింది. గోషమహల్లో 2.5 సెంటీమీటర్ల వర్షం కొట్టింది. 

అటు చార్మినార్, యూసుఫ్ గూడా, సరూర్నగర్, మలక్పేట్, సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. హయత్ నగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ పరిధిలో ఒక సెంటీమీటర్ వర్షపాతం  కురిసింది.