కొత్త ఫీచర్ : వాట్సాప్లో త్వరలో ‘వాయిస్ స్టేటస్’

కొత్త ఫీచర్ : వాట్సాప్లో త్వరలో ‘వాయిస్ స్టేటస్’

వాట్సాప్ స్టేటస్ అంటే మనకు ఇప్పటిదాకా తెలిసింది ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్, ఏవైనా లింకులు మాత్రమే. త్వరలో ఒక కొత్త రకమైన వాట్సాప్ స్టేటస్ ను మనం చూడబోతున్నాం. ఇంతకే అదేంటి అనుకుంటున్నారా ? మరేం లేదు.. వాయిస్ ను కూడా స్టేటస్ రూపంలో పెట్టుకునేలా కొత్త ఫీచర్ త్వరలో రాబోతోంది. ప్రస్తుతానికి వాట్సాప్‌ ఐఓఎస్‌ బీటా వెర్షన్‌లో కొందరు యూజర్లకు వాయిస్‌ స్టేటస్‌ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు.

 గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఆడియోను స్టేటస్‌గా పెట్టుకోవచ్చట. సాధారణ స్టేటస్‌ మాదిరిగానే ఇది కూడా 24 గంటల పాటు యాక్టివ్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే.. మనం ఏదైనా వాయిస్ క్లిప్ ను స్టేటస్ గా పెట్టేయొచ్చన్న మాట. అయితే ఎప్పటిలోగా ఈ ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులోకి వస్తుందన్నది తెలియరాలేదు.