దేవరాజ్ కొడుకు హీరోగా..

దేవరాజ్ కొడుకు హీరోగా..

సీనియర్ నటుడు దేవరాజ్ కొడుకు ప్రణం  హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘వైరం’.  సాయి శివం జంపాన దర్శకత్వంలో జె.మల్లికార్జున నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ పనులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన  టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌కు దేవరాజ్, చంద్ర దేవ రాజ్, బెనర్జీ, కాశీ విశ్వనాథ్​ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

హీరో ప్రణం మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ గారిని ఆదరించినట్లే  ఈ సినిమాతో  నన్ను కూడా  ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నాడు.  ‘ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పింది హీరోయిన్ మోనల్. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామన్నాడు దర్శకుడు సాయి.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు నిర్మాత మల్లికార్జున. నటులు ‘గరుడ’ రామ్, విన్ను మద్ది పాటి, కో ప్రొడ్యూసర్ అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి పాల్గొన్నారు.