నటి భర్త బాత్రూంలో చనిపోయాడు

నటి భర్త బాత్రూంలో చనిపోయాడు

బాలీవుడ్ నటి, ప్రముఖ టెలివిజన్ యాక్టర్ అయిన నీలు కోహ్లి భర్త చనిపోయాడు. తన ఇంట్లోనే బాత్రూంలో జారిపడి మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఎందుకంటే నెల రోజుల క్రితమే.. వీళ్లిద్దరూ తమ పెళ్లి రోజు వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. సినీ, టెలివిజన్ రంగంలోని అందర్నీ పిలిచి మరీ గ్రాండ్ ఫంక్షన్ చేశారు. ఈ ఫంక్షన్ జరిగిన కొన్ని రోజులకే నీలు కోహ్లి భర్త హర్మిందర్ సింగ్ చనిపోవటం షాక్ కు గురి చేసింది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హర్మిందర్ సింగ్ అమృతసర్ లోని తన ఇంట్లోనే ఉన్నారు. మార్చి 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం గురుద్వారాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఇంట్లోని బాత్రూంకి వెళ్లారు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో.. ఇంట్లోని పని మనిషి బాత్రూంకి వెళ్లి చూడగా.. నేలపై పడి ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. 

ఈ విషయంపై హర్మిందర్ సింగ్ కుమార్తె సాహిబా మాట్లాడారు. మా నాన్న బాత్రూంలో పడి చనిపోయారు.. మా తమ్ముడు నేవీలో ఉండటం వల్ల రెండు రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తాం అని తెలిపారామె. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేరని.. నాన్నతోపాటు సహాయకుడు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు సాహిబా. ఆస్పత్రికి తీసుకెళ్లటం ఆలస్యం అయ్యిందని.. అందుకే ఈ ఘోరం జరిగిందన్నారు. సంఘటన జరిగినప్పుడు మా అమ్మ నీలూ కోహ్లీ బయటకు ఉన్నారని.. పనిపై వెళ్లారని వివరించింది సాహిబా..

బాలీవుడ్ నటి నీలూ కోహ్లీ చాలా హిందీ సినిమాల్లో నటించారు. ఇటీవలే ఆమె హౌస్ ఫుల్ 2, హిందీ మీడియం, పాటియాలా హౌస్ వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సంగం, మేరే ఆంగ్నేమే, చోటి సర్దార్ని, మద్దం సర్ వంటి టెలివిజన్ షోల్లో నటించారు. బుల్లితెర, వెండి తెర నటిగా ఆమె చాలా పాపులర్. ఇటీవల భర్తతో ఘనంగా పెళ్లి వేడుక చేసుకున్న కొన్ని రోజులతో.. ఇంట్లోని బాత్రూంలో పడి భర్త చనిపోవటంతో ఆమె షాక్ లో ఉన్నారు . హర్మిందర్ సింగ్ మరణానికి అందరూ సంతాపం తెలుపుతున్నారు