కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈఓగా అశోక్ వాస్వానీ

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈఓగా  అశోక్ వాస్వానీ

న్యూఢిల్లీ : బ్యాంకర్ అశోక్ వాస్వానీ తమ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ),  సీఈఓగా బాధ్యతలు స్వీకరించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సోమవారం తెలిపింది. గత సెప్టెంబరులో బ్యాంకు అధిపతిగా వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ వైదొలిగిన తర్వాత, తాత్కాలిక ఎండీ,  సీఈఓ గా దీపక్ గుప్తా వచ్చారు. జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చేలా అశోక్ వాస్వానీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా బాధ్యతలు స్వీకరించారని కోటక్ మహీంద్రా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) వాస్వానీని మూడేళ్ల కాలానికి బ్యాంక్ ఎండీ  సీఈఓగా నియమించడాన్ని అక్టోబరు 2023లో ఆమోదించింది. ఉదయ్ కోటక్ మాదిరే ఆయన కూడా సిడెన్‌‌‌‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి.   క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్  కంపెనీ సెక్రటరీ కూడా. వాస్వానీ ఈ మధ్య కాలంలో బార్​క్లేస్​తో కలిసి పనిచేశారు. దీనికి ముందు పగయా టెక్నాలజీస్​ లిమిటెడ్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు.