సీనియర్ జర్నలిస్ట్ దాసు కె మూర్తి కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్ దాసు కె మూర్తి కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు దాసు కే.మూర్తి(99) కన్నుమూశారు. బుధవారం (జనవరి 21) ఉదయం అమెరికాలోని న్యూజెర్సీలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ది సెంటినెల్, ది డైలీ న్యూస్, ఇండియన్ ఎక్స్ ప్రెస్,టైమ్స్ ఆఫ్ ఇండియా, పేట్రియాట్ వంటి అనేక ప్రముఖ వార్తాపత్రికలలో డెస్క్ జర్నలిస్టుగా పనిచేశారు. దాసుకే మూర్తి మృతి పట్ల జర్నలిస్టు సంస్థలు, సీనియర్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. 

జర్నలిస్టుల కుటుంబం నుంచి వచ్చిన దాసు కే మూర్తి.. 1954లో ఉస్మానియా యూనివర్సిటీనుంచి జర్నలిజం పట్టాపొందారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) హైదరాబాద్  యూనివర్సిటీ, ఉస్మానియా వర్సిటీలో ఆయన జర్నలిజం లెక్చరర్ గావిద్యార్థులకు  బోధించారు. 

2023–2024లో ఆయన భారతీయ జర్నలిజం రంగంలో శతాబ్ది వ్యక్తిగా ,సజీవ లెజెండ్‌గా గుర్తింపు పొందారు. 2024లో OU పూర్వ విద్యార్థులు ఆయనను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.2001లో దాసు కేమూర్తి కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. అప్పటినుంచి అక్కడే ఉన్నారు.