తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్ (72) కన్నుమూశారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన మోహన్ రాజ్ గురువారం ( అక్టోబర్ 3) అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో లారీ డ్రైవర్, శివయ్య, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
మోహన్ రాజ్ దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించారు. మోహన్ రాజ్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు.
Also Read :- ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
మోహన్ లాల్ నటించిన కిరీడమ్ చిత్రంలో కీరిక్కడన్ జోస్ గా తన విలన్ పాత్రకు మోహన్ రాజ్ కు మంచి గుర్తింపు వచ్చింది. మూడు దశాబ్దాల పాటు సాగిన ఆయన కేరీర్ లో అనేక ముఖ్య మైన విలన్ పాత్రలను పోషించాడు.మలయాళ సినిమాపై చెరగని ముద్ర వేశారు.