అరసన్.. బార్న్‌‌‌‌ టు రూల్.. వెట్రిమారన్, శింబు కాంబోలో క్రేజీ మూవీ

అరసన్.. బార్న్‌‌‌‌ టు రూల్.. వెట్రిమారన్, శింబు కాంబోలో క్రేజీ మూవీ

శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సీనియర్ నిర్మాత కలైపులి ఎస్‌‌‌‌.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శింబు కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 49వ సినిమా. మంగళవారం ఈ మూవీ టైటిల్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేశారు. ‘అరసన్‌‌‌‌’ అనే పేరును ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ‘ది కింగ్ బార్న్‌‌‌‌ టు రూల్..’ అనే క్యాప్షన్‌‌‌‌తో విడుదల చేసిన ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో రక్తంతో తడిసిన షర్ట్‌‌‌‌, చేతిలో వేట కత్తితో సైకిల్‌‌‌‌పై చేయి వేసి నిల్చున్నాడు శింబు. తన లుక్‌‌‌‌ను బట్టి పీరియాడికల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో వస్తున్న గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ డ్రామా ఇదని అర్థమవుతోంది.

2018లో ఇదే బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ధనుష్‌‌‌‌ హీరోగా నార్త్‌‌‌‌ మద్రాస్‌‌‌‌ నేపథ్యంలో ‘వడ చెన్నై’ అనే సినిమా తీశాడు వెట్రిమారన్‌‌‌‌.  ఇప్పుడు దానికి కొనసాగింపుగా అదే నేపథ్యంలో ‘అరసన్‌‌‌‌’ తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌ వివరాలను రివీల్ చేస్తామని మేకర్స్ తెలియజేశారు.