FahadhFaasil: బిగ్ స్క్రీన్‌ విలక్షణ యాక్టర్ ఫహద్ ఫాజిల్ స్పెషల్

FahadhFaasil: బిగ్ స్క్రీన్‌ విలక్షణ యాక్టర్ ఫహద్ ఫాజిల్ స్పెషల్

మలయాళం అండ్ తెలుగు,తమిళ చిత్రాలతో వరుస సినిమాలు చేస్తున్న నటుడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్..సింపుల్గా ఫహద్ ఫాజిల్(Fahadh Faasil)గా ఎంతో గుర్తింపు పొందారు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్గా మరింత ఫేమస్ అయ్యాడు.  విభిన్నమైన పాత్రలు పోషిస్తూ..తనదైన నటనతో ప్రేక్షకుల మనస్సులో ఫహద్ ఫాజిల్ సినిమాలంటే..ఒక సిగ్నేచర్ మూమెంట్ ని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఫహద్ పలు భాషల్లో నటిస్తూ స్టార్ సెలెబ్రెటీ హోదా పొందుతున్నారు.  

తాజా విషయానికి వస్తే..ఇవాళ ఆగస్ట్ 8న ఫహద్ బర్త్డే సందర్బంగా తాను నటించబోయే సినిమాల నుండి విషెష్ అందుతున్నాయి. ఈ క్రమంలో పుష్ప టీమ్ నుంచి విషెస్ అందాయి. "స్టార్ నటుడు ఫహద్‌ఫాసిల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు..పుష్ప 2 ది రూల్లో భన్వర్ సింగ్ షెకావత్ IPS బిగ్ స్క్రీన్‌లపై సందడితో తిరిగి రానున్నారు" అంటూ మైత్రి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

అలాగే భారతీయ సినిమాకి రెండు మూలస్తంభాలైన సూపర్‌స్టార్స్ తో ఫహద్ ఫాసిల్ ఉన్న పోస్టర్ ను వెట్టాయన్ టీమ్ పోస్ట్ చేస్తూ విషెష్ తెలిపింది. అలాగే పలు భాషల సినీ స్టార్స్ స్పెషల్ విషెష్ చేశారు. 

ఇక ఫహద్ ఫాజిల్ సినిమాల విషయానికి వస్తే..సిద్ధార్థ్‌ నాదెళ్ల డెబ్యూ డైరెక్టర్ గా ‘ఆక్సిజన్‌’ (OXYGEN) పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రాబోతోంది. వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఆక్సిజన్‌ తెరెకెక్కిస్తుండగా..శోభ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, కార్తికేయలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శశాంక్‌ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కున్న మరో చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ (Dont Trouble The Trouble). ఫన్‌, థ్రిల్‌, ఎమోషన్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా..జూన్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా ఈ రెండు సినిమాలకి కల భైరవ మ్యూజిక్ అందించబోతున్నాడు. త్వరలో ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. అలాగే వీటితో పాటుగా మరిన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి.