నాగచైతన్యతో పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న శోభితా ధూళిపాళ్ల తిరిగి తన యాక్టింగ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పా.రంజిత్ డైరెక్షన్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘వెట్టువమ్’. ఇందులో శోభితా లీడ్ రోల్‌లో నటిస్తుంది. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు పా.రంజిత్. ఇందులో శోభితా ధూళిపాళ్ల ఒక ఎత్తైన గోడపై నిలబడి కనిపిస్తుంది. వెనుక భాగంలో నల్లటి మేఘాలు, మబ్బులతో నిండిన ఆకాశం ఉండగా, ఆమె ధైర్యంగా ముందుకు చూస్తున్న తీరు ఆకట్టుకుంది.
బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన శోభిత పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. పా.రంజిత్ ఫస్ట్ మూవీ ‘అట్టకత్తి’లో నటించిన దినేష్ ఇందులో హీరోగా, ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. మధురై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ ఇంటెన్స్ డ్రామాలో ఫహద్ ఫాజిల్, అశోక్ సెల్వన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గోల్డెన్ రెయోమ్స్ సంస్థతో కలిసి పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది.
