వొడాఫోన్ ఐడియా.. మరో 23 సిటీల్లో 5జీ సేవల విస్తరణ

వొడాఫోన్ ఐడియా.. మరో 23 సిటీల్లో 5జీ సేవల విస్తరణ

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) రాష్ట్రాల రాజధానులు జైపూర్, కోల్‌‌‌‌‌‌‌‌కతా,  లక్నోతో సహా మరో 23 నగరాలకు 5జీ కవరేజీని విస్తరించింది. వీఐ ఇప్పటికే ఐదు నగరాల్లో 5జీ సేవలను అందిస్తోంది. - ముంబై, ఢిల్లీ-–ఎన్‌‌‌‌‌‌‌‌సిఆర్, బెంగళూరు, చండీగఢ్  పాట్నాలో కంపెనీ 5జీ టవర్లను ఇన్​స్టాల్​ చేసింది. 

తాజాగా అహ్మదాబాద్, ఆగ్రా, ఔరంగాబాద్, కోజికోడ్, కొచ్చిన్, డెహ్రాడూన్, ఇండోర్, జైపూర్, కోల్‌‌‌‌‌‌‌‌కతా, లక్నో, మధురై, మలప్పురం, మీరట్, నాగ్‌‌‌‌‌‌‌‌పూర్, నాసిక్, పూణే, రాజ్‌‌‌‌‌‌‌‌కోట్, సోనెపట్, సూరత్, సిలిగురి, త్రివేండ్రం, వడోదర,  వైజాగ్​లో 5జీని అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సోమవారం తెలిపింది. వీఐ 22 టెలికాం సర్కిల్‌‌‌‌‌‌‌‌లలో 17 చోట్ల 5జీ స్పెక్ట్రమ్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసింది.  

కంపెనీ 5జీ ప్లాన్లు రూ. 299 నుంచి మొదలవుతాయి. సుమారు 65 వేల సైట్‌‌‌‌‌‌‌‌లలో 900 మెగాహెర్ట్జ్​ బ్యాండ్‌‌‌‌‌‌‌‌లో 4జీ కనెక్టివిటీని ఇస్తున్నామని, ఇండోర్ కనెక్టివిటీని మెరుగుపరిచామని కంపెనీ తెలిపింది. రాబోయే ఆరు నెలల్లో లక్ష కొత్త టవర్లను ఇన్​స్టాల్​ చేయాలని యోచిస్తున్నట్లు వీఐ పేర్కొంది.