హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ గ్లోబల్ పెట్ కేర్ (పెంపుడు జంతువుల సంరక్షణ) మార్కెట్లో విస్తరించేందుకు ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. తన పూర్తి అనుబంధ సంస్థ అయిన అలివిరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ ద్వారా ఇటలీ కంపెనీ బయోఫర్‌లైఫ్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
ఈ కొనుగోలు ఒప్పందం విలువ సుమారు రూ. 188 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నాటికి ప్రాసెస్ పూర్తవుతుందని అంచనా. బయోఫర్‌లైఫ్‌కు పెట్ కేర్ ప్రొడక్ట్‌లను డెవలప్ చేయడంలో, డిస్ట్రిబ్యూట్ చేయడంలో అనుభవం ఉంది. ఈ కొనుగోలు ద్వారా వియాష్ సైంటిఫిక్ యూరప్ మార్కెట్లో అడుగుపెట్టనుంది.
