పార్లమెంట్ సమావేశాల్లో సమయం వృధా అవుతోంది

V6 Velugu Posted on Nov 26, 2021

రాజ్యసభ నడిచే సమయం క్రమంగా తగ్గుతోందని రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ హాల్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విలువైన సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చించడానికే వాడుకోవాలని ఆయన సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా ఉండేలా సభ్యులు ఆలోచన చేయాలని కోరారు. గతంలో జరిగిన 254వ పార్లమెంట్ సెషన్ లో సభా సమయం కేవలం 29.60 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనమన్నారు. దాదాపు 70 శాతం సమయం వృధా అవుతోందని, సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని వెంకయ్యనాయుడు కోరారు.

Tagged Delhi, Parliamentary sessions, vice president venkaiah naidu, constitutional day, Central hall

Latest Videos

Subscribe Now

More News