
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 21 వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఇచ్చింది. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ.
షెడ్యూల్
ఆగస్టు 7: నోటిఫికేషన్
ఆగస్టు 21: నామినేషన్లు ప్రారంభం
ఆగస్టు 22:నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25: నామినేషన్ల ఉపసంహరణ గడువు
సెప్టెంబర్ 9: ఉపరాష్ట్రపతి ఎన్నిక,అదే రోజు ఫలితాలు
ఉపరాష్ట్ర పతి పదవికి జగదీప్ ధన్కర్ జులై 21 తన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 22న ఆమోదించారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉభయ సభల ఎంపీలు ఓటు వేయనున్నారు. ఏ పార్టీ కూడా విప్ జారీ చేయడానికి వీళ్లేదు.
ప్రస్తుతం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఒక ఖాళీ స్థానం ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఐదు ఖాళీలు ఉన్నాయి. ఉభయ సభల్లో ప్రస్తుతం 782 మంది సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో ఎన్డీయేకు 542 మంది సభ్యులలో 293 మంది సభ్యులు ఉన్నారు.
ఉప రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య పద్ధతిలో పరోక్షంగా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉంటారు. 1961 పూర్వం పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఉండేది. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను రద్దు చేశారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభల్లో ఎన్నికైన సభ్యులతోపాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్ చేయాలి. ఈ పిటిషన్పై ఎలక్టోరల్ కాలేజీలోని 10 మంది సభ్యులు సంతకం చేయాలి. సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అంటే ఉపరాష్ట్రపతిగా ఆయన గతంలో చేపట్టిన చర్యలు రద్దు కావు.