ఎమోషన్స్‌‌‌‌తో మెప్పించే అహింస: హీరో వెంకటేష్

ఎమోషన్స్‌‌‌‌తో మెప్పించే అహింస: హీరో వెంకటేష్

రానా తమ్ముడు అభిరామ్‌‌‌‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ రూపొందించిన చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్. ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పి.కిరణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ ‘యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌తో తేజ సక్సెస్‌‌‌‌లు సాధించిన సంగతి తెలిసిందే. అహింస’ కూడా అలాంటి ఓ యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనరే. ఎమోషన్స్‌‌‌‌తో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ చూశాను. లొకేషన్స్ నాకు బాగా నచ్చాయి. తేజ, ఆర్పీ కాంబినేషన్‌‌‌‌లో ఇప్పటికే మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త వాళ్లను ఇంట్రడ్యూస్ చేసే తేజ.. ఈ చిత్రంతో అభి, గీతికను పరిచయం చేస్తున్నారు. వాళ్లు కూడా హార్డ్ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని చెప్పారు.

తేజ మాట్లాడుతూ ‘నా టార్చర్ భరించి నాతో సినిమా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కొన్ని వందల మందికి చాన్స్ ఇచ్చిన రామానాయుడు గారి కోరిక మేరకు అభితో సినిమా తీశా’ అని చెప్పారు. ‘తేజ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆర్పీ సర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. హిట్ కొడతాననే నమ్మకం ఉంది’ అన్నాడు అభిరామ్. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది గీతిక. ‘అహింస’ అందర్నీ అలరిస్తుందన్నారు ఆర్పీ పట్నాయక్.