వీడియో: కొడుకు చెంపదెబ్బకు తల్లి మృతి

వీడియో: కొడుకు చెంపదెబ్బకు తల్లి మృతి

ఢిల్లీలో దారుణం జరిగింది. కొడుకు చేయిచేసుకోవడంతో ఓ తల్లి కుప్పకూలిపోయింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని ద్వార‌క ప్రాంతంలో మార్చి 15న జరిగింది. స్థానికంగా నివసించే అవతార్ కౌర్ అనే 76 ఏళ్ల మహిళ.. తన కొడుకు రణబీర్ మరియు అతని భార్యతో కలిసి ఉంటోంది. అయితే పార్కింగ్ విషయంలో అవతార్.. ఎదురింటి వాళ్లతో గొడవపడింది. ఈ విషయం గురించి అవతార్.. తన కొడుకు, కోడలితో కూడా ఇంటి బయట నిల్చొని మాట్లాడుతుండగా.. రణబీర్ ఒక్కసారిగా తల్లిపై చేయిచేసుకున్నాడు. దాంతో అవతార్ కిందపడింది. అత్తను పైకి లేపడానికి కోడలు ఎంతగానో ప్రయత్నించింది. కానీ, కొడుకు కొట్టిన దెబ్బకు అవతార్ అలాగే చనిపోయింది. ఈ సంఘటన మొత్తం ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. అవతార్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

వీడియో వైరల్ కావడంతో.. రణబీర్ పై బిందపూర్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ద్వారకా సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ మీనా తెలిపారు.